ఆశ్చర్యకరుడా నీదు కృపా – అనుదినం

ఆశ్చర్యకరుడా నీదు కృపా – అనుదినం అనుభవించెద

ఆది అంతము లేనిది – నీ కృప శాశ్వతమైనది

1.            ప్రేమతో పిలిచి నీతితో నింపి – రక్షించినది కృపయే –2

జయ జీవితమును చేసెదను – అమూల్యమైన కృపతో  –2ఆశ్చర్య

2.            ఆకాశము కంటె ఉన్నతమైనది – నీ దివ్యమైన కృపయే –2

పలు మార్గములలో స్థిరపరచినది – నవనూతన కృపయే –2 ఆశ్చర్య

3.            యేసయ్యా  – నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను –2

నీ కృపను గూర్చి పాడెదను ఆత్మానందముతో   2  ఆశ్చర్య