ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు

ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీశ

ఆశతో నమ్మి యున్నాము నీ సత్య వాగ్దత్తము

ఇమ్మాహి మీద క్రుమ్మరించుము దేవా

క్రమ్మర ప్రేమ వర్షంబున్ గ్రుమ్మరించుము దేవా

1.            ఓ దేవా పంపింపవయ్యానీ దీవెన ధారలన్

మా దాహమెల్లను బాపు మాధుర్యమౌ వర్షమున్    || ఇమ్మాహి ||

2.            మా మీద కురియించు మీశ ప్రేమ ప్రవాహంబులన్

సమస్త దేశంబు మీద క్షామంబు పోనట్లుగన్        || ఇమ్మాహి ||

3.            ఈనాడే వర్షింపు మీశ నీ నిండు దీవెనలన్

నీ నామమందున వేడి సన్నుతి బ్రౌర్ధింతుము     || ఇమ్మాహి ||