ఆశతీర నా యేసు స్వామిని కొలిచెదను

ఆశతీర నా యేసు స్వామిని  కొలిచెదను ఆత్మతో సత్యముతో   స్తుతించెదను 2

అను.ప:- ఎంత ధన్యమో యేసుని వెదకుట  ఎంత ధన్యమో

ఎంత భాగ్యమో యేసుని నమ్ముట  ఎంత భాగ్యమో  2

1.            దుప్పి నీటికై ఆశపడునట్లుగ  

దేవుని కొరకై ఆశపడుచున్నాను 2

దేవుని సన్నాధిని నిత్యముండునట్లుగా …. 2

దిన దినమాశతో కనిపెట్టుచున్నాను ఎంత ధన్యమో    ఆశతీర

2.            లోక ఆశలూ లయమై పోవును

లోకులెవ్వరూ కాపాడలేరు       2

లోపాలు సరిచేయు ప్రభువే ఆధారం…  2

లోబడు వారిని పరమున చేర్చును     ఎంత ధన్యమో ఆశతీర