ఆవేదన నేనొందను అవమానముతో

ఆవేదన నేనొందను అవమానముతో నే కృంగను

ఆనందమే నా జీవితం (2)

నా యేసుని బాహూవులో

1.            నాకేమి కావలెనో నేనేమి కోరెదనో (2)

నా ఊహలకు ఊపిరి పోసి

కోరిన ఈవుల నొసగిన ఉన్నతమైన అద్భుతమైన

నీ కార్యములు ఆశ్చర్యమే (2)

హల్లెలూయా హల్లెలూయా (2)

నా యేసుని బాహూవులో      ||ఆవేదన||

2.            కష్టాల కెరటాల సుడిగుండమందున (2)

కలవరమొంది కృంగిన నన్ను

కరుణతో పరమున చేర్చి శిఖరముపైన నిలిపిన దేవా

కృపలన్నియు కురిపించితివి (2)

హల్లెలూయా హల్లెలూయా (2)

నా యేసుని బాహూవులో    ||ఆవేదన||