ఆలయంలో ప్రవేశించండి అందరు స్వాగతం

ఆలయంలో ప్రవేశించండి అందరు స్వాగతం సుస్వాగతం యేసు నామంలో

మీ బ్రతుకులో పాపమా కలతలా మీ హృదయంలో బాధలా కన్నీరా

మీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం        ||ఆలయంలో||

1.            దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెదికే వారికంతా కనబడు దీపము

యేసు రాజు మాటలే వినుట ధన్యము

వినుట వలన విశ్వాసం అధికమధికమై

ఆత్మలో దాహము తీరెను రారండి

ఆనందమానందం హల్లెలూయా  ||ఆలయంలో||

2.            ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై  జీవ వృక్షంబుగా ఫలియించాలని పెదవితో పలికెదం మంచి మాటలే

హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై

నింపెదం నిండెదం కోరెదం పొందెదం

ఆనందమానందం హల్లెలూయా||ఆలయంలో||