ఆలకించుడి ప్రియుని స్వరము

ఆలకించుడి ప్రియుని స్వరము వినబడుచున్నది

ఇదిగో నా ప్రియుడు వచ్చుచున్నాడు

ఆనందం ఆనందం ఎంతో ఆనందం

ప్రియుడేసు సహవాసం ఎంతో సంతోషం

1.            దవళవర్ణుడు రత్నవర్ణుడు అతి పరిశుద్ధుడు

ఎవరు సాటి లేరు పోటి కాదు ప్రియుడేసుకు ||ఆనందం||

2.            ఆదరించి సేదదీర్చె ప్రియుడు నా వాడు

హత్తుకొనును ఎత్తుకొనును ఎంత ధన్యుడను ||ఆనందం||

3.            పాపం తీసి శుద్ధి చేసి సౌందర్యము నిచ్చెను

ప్రియుని పైన ఆనుకొనుచు సాగిపోయెదను ||ఆనందం||

4.            మేఘములపై ప్రియుడు త్వరగా రానైయున్నాడు

మహిమ ధరించి మేఘములపై ప్రియుని చేరెదను ||ఆనందం||