ఆరాధ్య దైవమా నా ప్రాణ దుర్గమా

ఆరాధ్య దైవమా నా ప్రాణ దుర్గమా (2)

నీవేగా నా జీవనారాధం(2)

యెహోవా యీరే యెహోవా షమ్మా

నీవే నా సమస్తము(2)

మన్నాను కురిపించి  మహిమను  చూపించి నన్ను పోషించుమయ్యా 

పగలు మేఘమై రాత్రి అగ్నియై నన్ను కాపాడుమయ్యా

నీ చేతి నీడలో నీ కను చూపులో నన్ను దాయుము నా యేసయ్యా(2)

అరణ్య యాత్రలో మార్గము నీవై నన్ను నడిపంచుమయ్యా

మోడు బారిన జీవితాన్ని చిగిరింప జేయుమయ్యా(2)

నీ కొరకే నే యిల ఫలియించెద నీ సాక్షిగా నే సాగెదనయ్యా (2)

నా ఎత్తయిన కోటవు నీవే నా ఆశ్రయమయ్యా

రాజుల రాజా ప్రభువుల ప్రభువా నీకే స్త్రోత్రమయ్యా(2)

నన్ను విడువని నన్ను మరువని నా కాపరి నీవే యేసయ్యా (2)