ఆరాధ్యదైవమా-నా ప్రాణదుర్గమా రాధ్యదైవమా-నా ప్రాణదుర్గమా

ఆరాధ్యదైవమా-నా ప్రాణదుర్గమా (2)

నీవేగా  నా జీవనాధారము (2)

యెహోవాయీరే యెహోవాషమ్మా (2)

నీవేగా నా సమస్తము (2)

1.మన్నాను కురిపించి మహిమను చూపించి నన్ను పోషించుమయ్యా

పగలు మేఘమై రాత్రి అగ్నియై నన్ను కాపాడుమయ్యా (2)

నీ చేతి నీడలో నీ కనుచూపులో నన్ను దాయుము నా యేసయ్యా-2

2.అరణ్యయాత్రలో మార్గము నీవై నన్ను నడిపించుమయ్యా

మెూడుబారిన జీవితాన్ని చిగురింపజేయుమయ్యా  (2)

నీ కొరకే నే ఇలా ఫలియించెద నీ సాక్షిగా నే సాగెదనయ్యా  (2)

3.నా ఎత్తైన కోటవు నీవే  నీవే నా ఆశ్రయమయ్యా

రాజుల రాజా ప్రభువుల ప్రభువా నీకే స్తోత్రమయ్యా (2)

నన్ను విడువని నన్ను మరువని నా కాపరి నీవే నా యేసయ్యా  (2)