ఆరాధనలకు యోగ్యుడవు

ఆరాధనలకు యోగ్యుడవు -స్తుతి గీతంబులకు పాత్రుడవు

ప్రభు యేసు నిన్ను పూజింతును -మనసారా నిన్నే కీర్తింతును

 ఆరాధనలకు  యోగ్యుడవు

1 భరియించితివి నా రోగములన్ భరియించితివి నా వ్యసనములన్

అరిగితివి నాకై కలువరికి-పరిహరించితివి పాప శిక్షన్||ఆరాధన||

2 నా యతిక్రమములకై గాయపడి నా దోషమునకై కొట్టబడి

చిందిన సిలువ రక్తములో -నా దారిద్ర్యము తొలగించితివి||ఆరాధన||

3 నసియించిన నను వెదకితివి -నసియించిన ననులేపితివి

నా శాపమును చూపించితివి-నీ శాంతముతో క్షమించితివి||ఆరాధన||