ఆరంభించెద యేసూ నీతో ప్రతిదినం

ఆరంభించెద యేసూ నీతో ప్రతిదినం

ఆనందించెద యేసూ నీలో ప్రతిక్షణం

ఆస్వాదించెద నీ మాటల  మాధుర్యం

ఆరాధించెద నిన్నే నిత్యం

1.నీ సన్నిధిలో ప్రతి ఉదయం- ఆలించెద నీ మధురం

అరుణోదయమున నీ సహవాసం

నింపును నాలో నూతన ధైర్యం

2.నీ చిత్తముకై ప్రతి విషయం- అర్పించెద నీ కృప

వేకువజామున నీ ముఖ దర్శనం

పెంచును నాలో ఆత్మవిశ్వాసం

3.నా పెదవులతో ప్రతి నిమిషం- స్తుతియించెద

దిన ప్రారంభమున నీ ప్రియ ధ్యానం కాల్చును నాలో అహము సర్వం