ఆయనే నా సంగీతము బలమైన

ఆయనే నా సంగీతము బలమైన కోటయును

జీవాధిపతియు ఆయనే

జీవిత కాలమెల్ల స్తుతించెదము         ||ఆయనే||

1.            స్తుతుల మధ్యలో నివాసం చేసి

దూతలెల్ల పొగడే దేవుడాయనే ||2||

వేడుచుండు భక్తుల స్వరము విని

దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే ||2||           ||ఆయనే||

2.            ఇద్దరు ముగ్గురు నా నామమున

ఏకీభవించిన వారి మధ్యలోన ||2||

ఉండెదననిన మన దేవుని

కరములు తట్టి నిత్యం స్తుతించెదము ||2||        ||ఆయనే||

3.            సృష్టికర్త క్రీస్తు యేసు నామమున

జీవిత కాలమెల్ల కీర్తించెదము ||2||

రాకడలో ప్రభుతో నిత్యముందుము

మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము ||2||       ||ఆయనే||