ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర

ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర

యేసుతో నూతనయెరుషలేము యాత్ర

మన.. యేసుతో నూతనయెరుషలేము యాత్ర    ||ఆనంద యాత్ర||

1.            యేసుని రక్తము పాపములనుండి విడిపించెను (2)

వేయినోళ్ళతో స్తుతించినను తీర్చలేము ఋణమును(2ఆనంద యాత్ర

2.            రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండా (2)

మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా (2) ||ఆనంద యాత్ర||

3.            కృతజ్ఞత లేని వారు వేలకొలదిగ కూలినను (2)

కృపా వాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృప పొందెదము (2) ||ఆనంద యాత్ర||

4.            ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం

 

ఆత్మానంద భరితులమై ఆగమనాకాంక్షతో సాగెదం |ఆనంద యాత్ర||