ఆనందము ప్రభు నాకొసగెన నా జీవితమే మారెను

ఆనందము ప్రభు నాకొసగెన నా జీవితమే మారెను (2)

నా యుల్లమందు యేసు వచ్చెన్

నా జీవిత రాజాయెను (2)         ||ఆనందము||

1.            ప్రభుని రుచించి ఎరిగితిని ఎంతో ఎంతో ప్రేమాముర్తి (2)

విశ్వమంతట నే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను (2)||ఆనందము||

2.            అలల వలె నా సంతోషము పైకి ఉప్పొంగి ఎగయుచుండె (2)

నన్ను పిలిచి మేలులెన్నో చేసే నూతన జీవమొసగెన్ (2||ఆనందము||

3.            శత్రువున్ ఎదిరించి పోరాడెదన్ విజయము పొంద బలమొందెదన్2

ప్రభువుతో లోకమున్ జయించెదన్ ఆయనతో జీవించెదన్ (2)    ||ఆనందము||