ఆనందము ప్రభు నాకొసగెను

ఆనందము ప్రభు నాకొసగెను

నా జీవితమే మారెను (2)

నా యుల్లమందు యేసు వచ్చెన్

నా జీవిత రాజాయెను (2)         ||ఆనందము||

1.            ప్రభుని రుచించి ఎరిగితిని

ఎంతో ఎంతో ప్రేమాముర్తి (2)

విశ్వమంతట నే గాంచలేదు

విలువైన ప్రభు ప్రేమను (2)      ||ఆనందము||

2.            అలల వలె నా సంతోషము

పైకి ఉప్పొంగి ఎగురుచుండె (2)

నన్ను పిలిచి మేలులెన్నో చేసే

 

నూతన జీవమొసగెన్ (2)       ||ఆనందమే||