ఆనందముతో – స్తుతియించెదము

ఆనందముతో – స్తుతియించెదము

ప్రభుయేసు పాదములను – పూజింతుము

1.మరణాంధకార లోకములోన

సాతాను చెరలో నేనుండగా

తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి

నీ ఘనత కొరకై యేర్పరచితివి

2.విలువైన ప్రేమ కనబరచితివి

నా ఘెార పాపములు క్షమియించితివి

ప్రభుక్రీస్తు సన్నిధి నిత్యము నుండు

ఆశను నాకెంతో కలిగించితివి

3.గర్భమున నేను రూపొందక మునుపే

నా దేవా నీవు నన్నెెంచుకొని

ఈ లోక సంబంధ బంధము తెంచి

పరలోక ద్వారము తెరచితివి

4.అరణ్యమందు నడచినగాని

ఎండిన నేలను నిలచిన గాని

పరలోక తండ్రి మారని ప్రేమను

వర్ణించుచూ గురి యెుద్దకు పరుగెత్తుదును