ఆనందముగా యెహోవా నీ కృపలన్ని

ఆనందముగా యెహోవా నీ కృపలన్ని

అన్ని కాలంబులందు కీర్తించెదన్ (2)

1.            చావు గోతినుండి లెవనెత్తి నాకు జీవమిచ్చిన జీవ దాత

వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో

సవ్యంబుగా ఈ భువియందున           ||ఆనందముగా||

2.            సింహపు పిల్లలు ఆకలిగొనిన- యెహొవ సహాయుడందరికి

ఇహమందునా ఏ మేలు కొదువ యుండదు

అహా! ఏమందు నీ విశ్వాస్యతన్         ||ఆనందముగా||

3.            ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్

ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన

కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్       ||ఆనందముగా||

4.            పర్వతంబులు పారిపోయినను- ఉర్విలోమార్పు కలిగిననూ

తరుణములు విరోధముగపై లేచినా

 

స్మరియించెద నీ విశ్వాస్యతన్             ||ఆనందముగా||