ఆదరి చేరే దారే కనరాదు

ఆదరి చేరే దారే కనరాదు

సంధ్య వెలుగు కనుమరుగైపోయే

నా జీవితాన చీకటిలో మూగే

1.            విద్యలేని పామరులను పిలిచాడు

 దివ్యమైన బోధలెన్నో చేశాడు

  మానవులను పట్టి జాలరులనుగా    చేసి

ఈ భువిలో మీరే నాకు సాక్షులన్నారు                 “ఆదరి “

2.            సుడిగాలులేవో వీచెను-అలలేమో పైపైకి లేచెను

 నా ఆశలన్నీ అడుగంటి పోయెను

  నా జీవితమే దిగజారి పోయెను        “ఆదరి “

3.            వస్తానన్నాడు విభుడు మాటతప్పడు

ఎంత గండమైన ప్రభు అండ ఉంటాడు

దరిచేర్చే నాధుడు నా వెంటనుండగా

ఎందుకు నా హృదయాన ఇంత తొందర “ఆదరి

4.            ఆదరిచేరే ఆ ప్రభువు పడవలో కాలుపెట్టి చూడు

 

నా జీవితమే వెలుగు నిండెనేడు “ఆదరి “