ఆత్మ దీపమును

ఆత్మ దీపమును (2)

వెలిగించు యేసు ప్రభు (2)       ||ఆత్మ||

వసియించుము నా హృదయమునందు (2)

1.            వసియించు నా నయనములందు (2)

అన్నియు నిర్వహించుచున్నావు (2)

నన్ను నిర్వహించుము ప్రభువా (2)       ||ఆత్మ||

2.            కలుషాత్ములకై ప్రాణము బెట్టి (2)

కష్టములంతరింప జేసి (2)

కల్వరి సిలువలో కార్చిన రక్త (2)

 

కాలువ యందు కడుగుము నన్ను (2)       ||ఆత్మ||