ఆత్మీయ వసంతకాలం – నలువది

ఆత్మీయ వసంతకాలం – నలువది దినాల ధ్యానం

కరుణమూర్తి త్యాగం ప్రేమ తలపోసే మంచి సమయం

లోకానికి దూరంగా – దేవునికి సమీపంగా

ఆత్మీయ ఉన్నతికి నడిపించు సోపానం

1. లోకాశలకు లాగెడు శత్రువులు

అపవాదిని ఈ దేహమును జయించను

ఉపవాసముతో – దైవ సన్నిధిలో

గడిపి తరించే ఆశీర్వాద కాలం

2. అవమానభరిత సిలువ మరణమును

పొందిన ఆ త్యాగశీలిని తలువను

పశ్చాత్తాపముతో – నియమ నిబంధనతో

 

ప్రార్థనలో గడిపే దీవెనకాలం