ఆకాశమందున్న ఆసీనుడా

ఆకాశమందున్న ఆసీనుడా

నీ తట్టు కనులెత్తుచున్నాను

నేను నీ తట్టు కనులెత్తుచున్నాను        ||ఆకాశ||

1.            దారి తప్పిన గొర్రెను నేను

దారి కానక తిరుగుచున్నాను (2)

కరుణించుమా యేసు కాపాడుమా        ||నీ తట్టు||

2.            గాయపడిన గొర్రెను నేను

బాగు చేయుమా పరమ వైద్యుడా (2)

కరుణించుమా యేసు కాపాడుమా        ||నీ తట్టు||

3.            పాప ఊభిలో పడియున్నాను

లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2)

 

కరుణించుమా యేసు కాపాడుమా        ||నీ తట్టు||